నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభమైంది. టెట్ నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ మంగళవారం విడుదల చేసిన విషయం తెలిసిందే.
దరఖాస్తుల సమర్పణ కు తుది గడువు ఈనెల 16 వరకు ఉన్నది. వచ్చేనెల 15న టెట్ రాతపరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోనూ నిర్వహిస్తారు. అదేరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్-2 రాతపరీక్షలుం టాయి. ఇతర వివరాలకు https://tstet.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. మొదటిరోజు 16 వేల మంది దరఖాస్తు చేసినట్టు సమాచారం.