– మంత్రి సబితకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జీవోనెంబర్ 17,18,15 ప్రకారం అప్‌గ్రేడ్ అయిన పండితులు, పీఈటీ పోస్టులను ఈ పదోన్నతుల షెడ్యూల్‌లో చేర్చాలనీ, హైకోర్టు తీర్పు ప్రకారం పదోన్నతులు ఇవ్వాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డికి సోమవారం ఆయన లేఖ రాశారు. జీవోనెంబర్ 17,18లు 2017, ఫిబ్రవరిలో, జీవోనెంబర్ 15ను 2019, ఫిబ్రవరిలో ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ఇప్పటికే వాటి అమలుకు చాలా ఆలస్యమైందని పేర్కొన్నారు. ఇంకా ఆలస్యం చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదని తెలిపారు.