నిబంధనల మేరకే…

– వరిధాన్యం కొనుగోలు చేయాలి జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
వానాకాలం 2023-24 వరి ధాన్యం కొనుగోళ్ళ లో రైతుల కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిబంధనల మేరకు వరి దాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో వరి ధాన్యం కొనుగోలు కేం ద్రాల నిర్వహకులు, రైస్‌ మిల్లర్లు, ధాన్యం రవాణ కాంట్రాక్టర్లు, అధికారులతో నిర్వహించిన సన్నా హక సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ఎన్నికల కోడ్‌ ఉన్నందున రైతుల ధాన్యం కొను గోలును ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోను గోలు చేయాలన్నారు. పండించిన వరి ధాన్యాన్ని రైతుల దగ్గరి నుండి కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులు తలెత్తకుండా గన్ని బ్యాగులు, టార్పాలిన్‌లు, ప్యాడిక్లీనింగ్‌ మిషన్‌లు,టెంట్‌ లు, మంచి నీళ్ళు, కుర్చీలు, గన్ని బ్యాగ్స్‌ నిల్వ ఉంచ డానికి ఒక రూంను అందుబాటులో ఉంచాలని అన్నారు. ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 25 లక్షల గన్ని బ్యాగ్స్‌ అవసరం కానున్నాయని గన్ని బ్యాగ్స్‌ కొరత ఉంటే మిల్లర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అన్నారు. నాలుగు ఫ్లెక్సీలను వరి దాన్యం కోనుగోలు కేంద్రాల వద్ద, గ్రామ పంచాయితీ కార్యాలయాల వద్ద ఏర్పాటు చే యాలన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వద్ద తూనికలు,కొలతలు శాఖ ద్వారా అనుమతి పొందిన డిజిటల్‌ వేయింగ్‌ మిషన్‌లు ఏర్పాటు చేయాలని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ధాన్యాన్ని తీసుకు వచ్చేటప్పుడు వారి వెంట పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్‌ కార్డు తప్పనిసరి తీసుకురావాలని ఓక వేల పట్టాదారు పాసు పుస్తకాలు లేనియెడల స్థానిక వ్యవసాయ శాఖ అధికారితో లెటర్‌ తీసుకురావాలని అన్నారు. మంచి నాణ్యమైన వరి ధాన్యాన్ని తేమ శాతం తక్కువ ఉండేలా చూసుకోవాలని ఎలాంటి తాలు, రాళ్ళు మట్టి గుళ్ళలు లేకుండా ఉన్న వరిదాన్యాన్ని కోనుగోలు కేంద్రాలకు తరలించాలని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు లో ఎలాంటి అవకతవకలు పాల్పడితే వారి పై తగు కటిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, పిడి డిఆర్డిఏ, పురుషోత్తం, డిసిఎస్‌ఓ నర్సింగరావు, డియం సివిల్‌ సప్లై రాఘవేందర్‌, డిఎఓ, విజయ భాస్కర్‌ ,డియంఓ కనకషేకర్‌, డిసిఓ, , పిఎసిఎస్‌ సిఓలు, డిఆర్డిఓ, ఎపియంలు, రైస్‌ మిల్లర్ల ప్రతినిధులు, తదితరులు పాల్గోన్నారు.