నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాదు నగర మేయర్ దండు నీతు కిరణ్ ని, స్టేట్ ఏసీ ఎస్ఎం కన్సల్టెంట్ సురేష్ మర్యాద పూర్వకంగా మంగళవారం కలిశారు. ప్రజల్లో అవగాహనా పెంపోదించడం లో మేయర్ సహకారం కావాలని కోరారు. ఇందుకు నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కొరకు మా సహకారం ఎల్లవేళలా ఉంటుందని, టిబి వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహనా పెంపొందేలా యాక్షన్ ప్లాన్ చేయమని డిఎంహెచ్వో కు సూచించింది. టిబి పై అవగాహనా పెంచే ఏ కార్యక్రమానికైనా తను హాజరు అవుతానని ఈ సందర్బంగా తెలిపారు.దేశం లోనే నిజామాబాదు జిల్లాకు టిబి నియంత్రణ లో పేరు వచ్చిందని, క్షయ విభాగం ఉద్యోగులు తమ సేవలు ఇలాగే కొనసాగిస్తూ నిజామాబాదు ని టిబి రహిత జిల్లా గా మార్చాలని సూచించారు. ఈ కార్యక్రమం లో జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ యం. సుదర్శనం, జిల్లా టిబి కోఆర్డినేటర్ రవి, డీపీపీఎం నరేష్ ఉన్నారు.