నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవు

వ్యవసాయ శాఖ ఉపాసంచాలకులు పరశురాం నాయక్‌
నవతెలంగాణ-పాలకుర్తి
ఎరువుల దుకాణాల నిర్వహకులు నకిలీ విత్త నాలను విక్రయిస్తే చర్యలు తప్పవని పాలకుర్తి సబ్‌ డివిజన్‌ వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు అజ్మీర పరశురాం నాయక్‌ హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలో పలు ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి ని పెద్దిరెడ్డి వరలక్ష్మితో కలిసి స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ టీం తనిఖీ నిర్వహించారు. ఎరువుల దుకాణాల్లో రికార్డులతో పాటు స్టాక్‌ రిజిస్టర్‌, ధరల పట్టికను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పనుల్లో ని మగమైన రైతులు ఖరీఫ్‌ సీజన్లో ఎరువుల విత్తనాల కోసం ఎదురు చూస్తారని తెలిపారు. ఆరుగాలం కష్టపడే రైతుకు నకిలీ విత్తనాలు అందజేసి మోసం చేయ రాదని సూచించారు. నకిలీ విత్తనాలను సరఫరా చేస్తే చర్యలు తప్పవని హెచ్చ రించారు. ప్రతి ఎరువుల దుకాణాల యజమాని సంబంధిత రికార్డులను ఎప్పటకప్పుడు అప్డేట్‌ చేయాలని సూచించారు. నకిలీ విత్తనాల సరఫరా పై రైతుల నుండి సమాచారం అందితే పిడి యాక్టివ్‌ నమోదు చేస్తామని స్పష్టం చేశారు. తనిఖీల్లో స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ టీం, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.