నిబంధనలకు మించి తరుగు తీస్తే చర్యలు

– వరంగల్‌ పోలిస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌
నవతెలంగాణ-వరంగల్‌
ధాన్యం తూకం విషయంలో ప్రభుత్వ నిబంధనలకు మించి తరుగు తీస్తే సదరు రైస్‌ మిల్లుపై చర్యలు తీసు కుంటామని వరంగల్‌ పోలిస్‌ కమిషనర్‌ రైస్‌ మిల్‌ యాజ మాన్యానికి సూచించారు. ధాన్యం తూకంగా అంశానికి సంబంధించి రైస్‌ మిల్‌ అసోసియెషన్‌ సభ్యులతో మంగళవారం పోలిస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. వరంగల్‌, జనగామ, హనుమ కొండ జిల్లాలకు చెందిన రైస్‌మిల్‌ అసోసియేషన్‌ సభ్యులతో కలిసి రైస్‌ మిల్‌ యాజమాన్యం తీరుపై చర్చించారు. అనంతరం పోలిస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ శాంతి భద్రతల అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ధాన్యం తూకం విషయంలో పోలిస్‌ జోక్యం ఉంటుందన్నారు. కొద్ది రోజులుగా ఐకేపీ కేంద్రాల నుండి మిల్లులకు తరలించిన ధాన్యం తూకంలో ఎక్కువ మొత్తంలో తరుగు తీయడం సరికాదని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి తరుగు తీయాలన్నారు. సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలని అన్నారు. రైసు మిల్లుల యాజమాన్యంపై కేసులను నమోదు చేసి ఇబ్బందులకు గురి చేయడం పోలీసుల లక్ష్యం కాదని అన్నారు. వచ్చిన నష్టాన్ని రైతుల నుండి వసూళ్ళు చేయొ ద్దని, రైతులు ఇచ్చిన ఫిర్యాదులపైనే కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా మిల్లులో జరుగుతున్న కార్యకలపాలపై రైతుల నుండి ఫోటోలు, వీడియో దృశ్యాలు అందుతు న్నాయని తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని నేరుగా రైస్‌ మిల్లుకు తరలించవద్దని, ఐకేపీ కేంద్రాల్లో తూకం అనంతరం ధాన్యం బస్తాలను లారీల్లో మాత్రమే రైస్‌ మిల్లులకు తరలిం చాలని అన్నారు. వీలైనంత వరకు కోసిన ధాన్యాన్ని శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో టాస్క్‌ ఫోర్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసిపిలు జితేందర్‌ రెడ్డి, తిరుమల్‌, ఇన్స్పెక్టర్‌ శ్రీనివాస్‌ రావు, శ్రీనివాస్‌ తో పాటు వరం గల్‌ జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తోట సంపత్కుమార్‌, హనుమకొండ జిల్లా అధ్యక్షు లు ఎర్రబెల్లి వెంకటేశ్వర్రావు, జగన్‌, రాష్ట్ర ఉపాధ్య క్షుడు అంజయ్య, జనగాం జిల్లా అధ్యక్షడు జయ హరితొ మిల్లు యజమానులు పాల్గోన్నారు.