కార్యకర్తలే నా బలం… కార్యకర్తలు నా కుటుంబ సభ్యులు

– ఆత్మీయ సమ్మేళన సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర
నవతెలంగాణ-రేగొండ
బీఆర్‌ఎస్‌ కార్యకర్తలే నా బలం, నా కుటుంబ సభ్యులు అని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఎస్‌ఎల్‌ఎన్‌ గార్డెన్‌లో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళన సమావేశం బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు, వరంగల్‌ రూరల్‌ జెడ్పీ చైర్పర్సన్‌ గండ్ర జ్యోతి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి హాజరై మాట్లాడుతూ గత ఆంధ్ర పాలకుల కాలంలో తెలంగాణ అభివద్ధికి నోచుకోలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కెసిఆర్‌ కాలేశ్వరం ప్రాజె క్టును మూడు సంవత్సరంలో పూర్తి చేయడం వల్ల సాగు త్రాగునీళుకొదవ లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలుపరు స్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడ అమలుపరచని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తూ అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూసేలా పరిపా లన కొనసాగిస్తున్నారని అన్నారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందిస్తూ, కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందడం వల్ల రాష్ట్ర ధాన్యకారంగా, అన్నపూర్ణ రాష్ట్రంగా ఏర్పడిం దని అన్నారు. రైతుల పండించే వరి ధాన్యాన్ని కొనుగోలును వారం రోజుల్లో పూర్తి చేస్తామని రైతులు ఎలాంటి అధైర్య పడవద్దు అని అన్నారు. రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. రైతు సంక్షేమం కొరకు రైతుబంధు రైతు బీమా ఉచిత విద్యుత్తును అందిస్తున్నారని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టును మూడు సంవత్సరాల కాలంలో పూర్తిచేసి తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని ఆయన అన్నారు. భూపాల్‌ పల్లి నియోజకవర్గంలో అనేక నిధులు తీసుకువచ్చి నియోజకవర్గా న్ని అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు. మండలాల్లోని ప్రతి గ్రా మంలో అంతర్గత రోడ్లు సైడ్‌ డ్రైనేజ్‌, డంపింగ్‌ యార్డులు మొదల గు పనులకు అనేక నిధులను మంజూరు చేసి గ్రామాలను అభివద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలిపారు. ప్రతి కార్యకర్త నా కుటుంబ సభ్యులుగా భావిస్తూ అనేక సేవలు చేస్తున్నామని పదిమందికి ఉపాధి కల్పించేలా జిఎంఆర్‌ ట్రస్ట్‌ ను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి అనేక పోటి పరీక్షలకు అధ్యాపకులచే ఉచితవిద్య బోధనను అం దిస్తున్నామని అన్నారు. కార్‌ డ్రైవింగ్‌ నేర్పించడంతోపాటు ఉచిత డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మూడోసారి హైట్రిక్‌ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధి కారంలోకివస్తుందని కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి గడ్డపై బీఆర్‌ఎస్‌ జండా ఎగిరే వేయడానికి గ్రామాల్లో ప్రతి కార్యకర్త కంకణబద్ధులై పని చేయాలని దిశనిద్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌ మాజీ జడ్పీ చైర్పర్సన్‌ సాంబారి సమ్మారావు ఎంపీపీ లక్ష్మీ రవి జెడ్పిటిసి విజయ స్థానిక ఎంపిటిసి సుమలత బిక్షపతి, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ మహేందర్‌ పిఎ సిఎస్‌ చైర్మన్‌ విజన్‌ రావు, వైస్‌ ఎంపీపీ ఉమారాణి విద్యాసాగర్‌ రెడ్డి, పిఎసిఎస్‌ వైస్‌ చైర్మన్‌ పాపిరెడ్డి, సర్పంచులు నారాయణరెడ్డి, శ్రీనివాసరావు రంజిత్‌ సంతోష్‌ తిరుపతి రెడ్డి, బి ఆర్‌ఎస్‌ రేగొండ గోరుకొత్తపల్లి మండలాల అధ్యక్షులు రాజేందర్‌ సంతోష్‌ రేగొండ టౌన్‌ అధ్యక్షులు బిక్షపతి, నాయకులు ఉమేష్‌ గౌడ్‌ శంకర్‌, కిరణ్‌, శ్రీనివాస్‌, రాజయ్య ప్రశాంత్‌ రావు, రజనీకాంత్‌, అశోక్‌ రెడ్డి, నరేష్‌, వివిధ గ్రామల సర్పంచులు ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.