కార్యకర్తలే నా బలం.. ప్రజలే నా బలగం

– గ్రామాల అభివృద్ధే అంతిమ లక్ష్యం
– ప్రజల బాగోగులే పరమావధి..
– కేసీఆర్‌ పాలన దేశానికే ఆదర్శం
– మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
– గన్నారంలో ఘనంగా ఆత్మీయ సమ్మేళనం
నవతెలంగాణ-రాయపర్తి
నలభై సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో కా ర్యకర్తలే నాబలం.. ప్రజలే నా బలగం అని పంచా యతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. మంగళవారం మండలంలోని తిర్మలాయ పల్లి, గన్నారం, కేశావపురం, జింకురాం తండా, ఎర్ర కుంటతండాల పరిధిలో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళ నం ఏర్పాటు చేయగా మంత్రి ముఖ్య అతిథిగా విచ్చే సి ప్రజలతో ఫోటోలు దిగి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ గ్రామాల అభివృద్ధే అంతిమ లక్ష్యమని ఉద్ఘాటిం చారు. ప్రతి ఒక గ్రామంలో ఎన్నడు లేనంత అభివద్ధి జరుగుతుందని తెలిపారు. తెలంగాణలో సమ్మిళిత వద్ధి జరుగుతున్నది అని పేర్కొన్నారు. ఓవైపు సం క్షేమ పథకాలు పేదలకు భరోసా ఇస్తుంటే, ఒకప్పుడు కునారిల్లిన వ్యవసాయరంగం సుభిక్షంగా మారింద న్నారు. పారిశ్రామిక రంగం పరుగులు పెడుతుంటే, ఐటీరంగం దేశంలోనే అగ్రభాగానికి చేరింది అని చె ప్పారు. మౌలిక వసతుల కల్పనతో పల్లెలు కొత్తరూపు సంతరించుకొని స్వచ్ఛతలో దేశానికే ఆదర్శంగా ని లుస్తున్నాయి అని వివరించారు.
పల్లెల సమగ్రాభివృద్ధితోనే గాంధీజీ కలలుకన్న గ్రామస్వరాజ్యం, గ్రామాల ప్రగతి, ప్రజా జీవన ప్ర మాణాల్లో పురోగతిని సీఎంకేసీఆర్‌ ఆశయ సాధనతో సాధించామన్నారు. మండలానికి ఎన్నినిధులు మం జూరు చేయడానికైనా సిద్ధం అని హామీ ఇచ్చారు. ఇ ప్పటికే చేపట్టిన పనులు త్వరగా పూర్తి ఆవుతున్నవి అని అభివర్ణించారు. మన పథకాలపై దేశంలో విస్తృ తంగా చర్చ జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీ ఆర్‌కు ప్రజలు ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలవాలని కోరారు.
అభివృద్ధికి చిరునామా : ఎమ్మెల్యే ఆరూరి
అభివృద్ధికి చిరునామా తెలంగాణ రాష్ట్రం అని వర్ధన్నపేట ఎమ్మెల్యే బిఆర్‌ఎస్‌ పార్టీ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు ఆరూరిరమేష్‌ అన్నారు. ఆత్మీయ సమ్మేళ నంలో పాల్గొన్న ఆయన ఈ విధంగా మాట్లాడారు.. గ్రామాలను అభివద్ధి చేయడంలో మంత్రి ఎర్రబెల్లి అహర్నిశలు కృషి చేస్తున్నాడని కొనియాడారు. ప్రభు త్వం ప్రవేశపెడుతున్న ప్రతి ఒక్క పథకం చరిత్రలో ని లిచిపోయే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. బీఆర్‌ ఎస్‌ ఆత్మీయ సమ్మేళనాలు ఇంత ఘనంగా జరుపు కోవడం సంతోషకరమన్నారు. రాయపర్తి మండలం లో జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాలు ఇతర మండ లాలకు ఆదర్శంగానిలుస్తున్నాయన్నారు. ముఖ్య మం త్రి కేసీఆర్‌ పాలనలో సంబండా వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, రైతు బంధు మండల సర్పంచులు గజ్జవెళ్లి అనంత ప్రసాద్‌, కుక్కల భాస్కర్‌, సుధర్‌ నాయక్‌, ఎల్లమ్మ యాకయ్య, ఎంపీటీసీ బానోత్‌ స్వేత, పార్టీ ఉపాధ్యక్షులు ఎండి నాయిమ్‌, గబ్బేట బాబు, మండల ప్రధాన కార్యదర్శి పూస మధు, యూత్‌ మండల అధ్యక్షుడు సాగర్‌ రెడ్డి, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.