
బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ కు పార్టీ టికెట్ ఇవ్వడంతో రెంజల్ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం ఎదుట టిఆర్ఎస్ నాయకులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈసారి కూడా ఎమ్మెల్యేగా మహమ్మద్ షకీల్ అమీర్ హ్యాట్రిక్ సాధిస్తారని వారు పేర్కొన్నారు. అనంతరం కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎమ్మెస్ రమేష్ కుమార్, రఫిక్, టి. అంజయ్య, ప్రశాంత్, సమీ, తిరుపతి రాము, షబ్బీర్, రజక సంఘం నాయకులు దేవిదాస్, బాలయ్య, మూట పోశెట్టి , రెంజల్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.