కార్యకర్తలు సైనికుడిలా పని చేయాలి : శ్రీనుబాబు

కార్యకర్తలు సైనికుడిలా పని చేయాలి : శ్రీనుబాబునవతెలంగాణ-మల్హర్‌రావు
ప్రతి యూత్‌ కార్యకర్త ఒక సైనికుడులా పని చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ విజయానికి కషి చేయాలని శ్రీపాద ట్రస్ట్‌ చైర్మన్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు పిలుపు నిచ్చారు. మంథని యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎరుకల ప్రవీణ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్‌ కాంగ్రెస్‌ సమావేశానికి శ్రీనుబాబు హాజరై మాట్లాడారు కాంగ్రెస్‌ పార్టీకి ముఖ్య విభాగమని,తెలంగాణ రాష్ట్రన్ని సోనియా ఇచ్చారని, అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ప్రవే శపెట్టిన ఘనత మంథని ముద్దుబిడ్డ దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబుదేన్నారు.ఇంటికో ఉద్యోగం ఇస్తా నని, నిరుద్యోగ భృతి ఇస్తానని కేసీఆర్‌ ప్రభుత్వం యువతను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు అయిన 6నెలల్లో 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పెట్టిన ఆరు గ్యారంటీలను ప్రతి గడప గడపకు తీసుకపోవడంలో యువజన కాంగ్రెస్‌ ముఖ్యపాత్ర పోషించాలని పేర్కొ న్నారు. అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్‌ పార్టీనేని వచ్చిన వెంటనే యువకులకు పెద్దపీట వేస్తుందన్నారు.