నవ తెలంగాణ- రెంజల్: రెంజల్ మండలం ఆదర్శ పాఠశాల 10వ తరగతి విద్యార్థి నీ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేయడం జరిగిందని, పాఠశాల ప్రిన్సిపాల్ బలరాం, కమిటీ చైర్మన్ నాగరాజు పేర్కొన్నారు. పదవ తరగతి పరీక్షల్లో తమ పాఠశాల విద్యార్థులు ఈ స్టడీ మెటీరియల్ సద్వినియోగం చేసుకొని మండల స్థాయిలో ర్యాంకులను సాధించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చిన్నప్ప, సుష్మ, అరుణ జ్యోతి, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.