– రాణి కుముదిని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర యువత విదేశీ ఉద్యోగాలు పొందేలా అవసరమైన నైపుణ్యాల పెంపునకు తగిన శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని తెలిపారు. బుధవారం ఎంపికైన విద్యార్థుల కోసం ఆమె జర్మనీ అస్బిల్డింగ్ (వొకేషనల్ ట్రైనింగ్)ను ప్రారంభించారు. టామ్ కామ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జర్మన్ కాన్సులేట్ జనరల్ మైకెలా కుచ్లెర్, టామ్ కామ్ సీఈవో డాక్టర్ విష్ణు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.