నవ తెలంగాణ- నవీపేట్: రాష్ట్ర ప్రభుత్వం మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల, కళాశాలలో ఎంబీసీ విద్యార్థులకు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ ను సద్వినియోగం చేసుకొని 14 మంది విద్యార్థులను ఎంబీసీ నాయకులు చేర్చడంపై యంచ సర్పంచ్ లహరి ప్రవీణ్ కుమార్ ఆదివారం హర్షం వ్యక్తం చేస్తూ సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షులు నరహరి రాష్ట్ర కార్యవర్గ విజ్ఞప్తి మేరకు ఎంపీసీ కులాలకు చెందిన తల్లిదండ్రుల కు సమాచారం ఇచ్చి నిజామాబాద్ జిల్లాలో గల మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే కళాశాలలో 14 మంది విద్యార్థులను చేర్చడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంబిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు పాడ్డే రాజు, కార్యనిర్వాహక అధ్యక్షులు అశోక్ రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.