మళ్లీ తగ్గిన విదేశీ మారకం నిల్వలు

Again reduced foreign exchange reservesముంబయి: భారత విదేశీ మారకం నిల్వల్లో మళ్లీ తగ్గుదల చోటు చేసుకుంది. ఈ నెల 20తో ముగిసిన వారంలో 2.36 బిలియన్‌ డాలర్లు క్షీణించాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) వెల్లడించింది. దీంతో అక్టోబర్‌ 20 నాటికి దేశంలో గల ఫారెక్స్‌ నిల్వలు 583.53 బిలియన్‌ డాలర్లకు పరిమితమ య్యాయి. అంతకుముందు అక్టోబర్‌ 6 నుంచి 13 మధ్య 1.153 బిలియన్‌ డాలర్లు పెరిగాయి. వరుసగా నెల రోజులకుపైగా పడిపోయిన విదేశీ మారకపు నిల్వలు.. ఒక్క వారం పెరిగినట్టే పెరిగి తిరిగి పతనం కావడం గమనార్హం. దీంతో సెప్టెంబర్‌ 1 నుంచి ఈ నెల 20 వరకు 15 బిలియన్‌ డాలర్లకు పైగానే దేశీయ ఫారెక్స్‌ నిల్వలు పడిపోయినట్లయ్యింది.