నవతెలంగాణ- నవీపేట్: అక్రమ అరెస్టులకు నిరసనగా సమగ్ర శిక్ష ఉద్యోగులు గురువారం ముఖానికి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు హైదరాబాదులోని చలో ఎస్ పి డి కార్యాలయం ముట్టడి సందర్భంగా పోలీసులు బుధవారం ముందస్తు అరెస్టులు చేసినందుకు నిరసనగా నవీపేట్ మండల కేంద్రంలోని ఎంఆర్సి మరియు మోకన్ పల్లి కేజీబీవీ పాఠశాలలో ఉద్యోగులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం గుర్తించి వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారిని రాణి, రాకేష్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.