
నవతెలంగాణ – ఊరుకొండ
ఆధునిక పద్ధతిలో అధిక దిగుబడులు వచ్చేలా నూతన ఒరవడితో వ్యవసాయం చేయాలని కె.వి.కె. పాలెం శాస్త్రవేత్తలు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ శైల అన్నారు. శుక్రవారం ఊరుకొండ మండల పరిధిలోని గుడిగానిపల్లి గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం వారి సహకారంతో పాలెం గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమం విద్యార్థుల ఆధ్వర్యంలో గ్రామీణ భాగ్యస్వామ్య విశ్లేషణాత్మక సదస్సు నిర్హహించారు. ఈ సందర్భంగా రైతులకు వ్యవసాయ సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. వ్యవసాయంలో సాగు చేసే విధానాలు.. పంటల దిగుబడులు, ఆదాయాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కె.వి.కె పాలెం విద్యార్థినిలు ఆశ్వియ సభ, అమూల్య గౌడ్, చందన, హరీష,అశ్వినిశెట్టి. సర్పంచ్ కృష్ణయ్య, కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, రైతులు, తధితరులు పాల్గొన్నారు.