నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పాలేరులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాననే రాజకీయ సంకల్పంతో వైఎస్ షర్మిల ఏఐసీసీ అధినేత్రి సోనియాను గురువారం కలిసిన విషయం తెలి సిందే..అదే సమయంలో తుమ్మల నాగేశ్వర్‌రావును రేవంత్ రెడ్డి కలిసి కాంగ్రెస్‌పార్టీలోకి రావాలని ఆహ్వానించాడంటే..ఏఐసీసీకి రేవంత్‌కు మధ్య వైరుధ్యం ఉందని అర్థమవుతున్నదని బీఆర్‌ఎస్ నేత దాసోజ్ శ్రావణ్ ట్విట్ చేశారు. గ్రూప్ తగాదాలతో సతమవుతున్న కాంగ్రెస్ పార్టీలో వీరిద్దరి చేరిక మరింత అగాధాన్ని పెంచే అవకాశం ఉండొచ్చని పేర్కొన్నారు.