– టీజీవోకు టీజీపాలా వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పీఆర్సీ ఏఐసీటీఈ బకాయిలపై సీఎం కేసీఆర్‌కు నివేదించాలని టీజీవోకు తెలంగాణ గెజిటెడ్ పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీపాలా) కోరింది. టీజీవో అధ్యక్షురాలు వి మమత, ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణను బుధవారం హైదరాబాద్‌లో టీజీపాలా సీఈసీ సభ్యులు కలిసి వినతిపత్రం సమర్పించారు. పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయడంలో కృషి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. సత్వరమే పీఆర్సీ బకాయిలు అమలయ్యేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో టీజీవో కోశాధికారి రవీందర్‌కుమార్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎంబీ కృష్ణయాదవ్, నగర శాఖ అధ్యక్షులు జి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ కార్యదర్శి మహమ్మద్ ఖాదర్, నాయకులు జిఎస్ చంద్రజ్యోతి, టీజీపాలా అధ్యక్షులు వై నర్సయ్యగౌడ్, ప్రధాన కార్యదర్శి కెఎస్ చక్రవర్తి, నాయకులు డి వెంకటేశ్వర్లు, బి శ్రవన్‌గౌడ్, పి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.