ఐక్య పోరాటానికి విజయం ఏఐపీడబ్ల్యూఎఫ్‌ అభినందన

– జియావుల్‌ ఆలంపై తప్పుడు అభియోగాలు మోపారని ఆరోపణ
న్యూఢిల్లీ : తన కార్యాలయం నుంచి ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రెటరీ, కామ్రేడ్‌ జియావుల్‌ ఆలం సహా ట్రేడ్‌ యూనియన్‌ కార్యకర్తలను దురుద్దేశపూర్వకంగా అరెస్టు చేసి వారిపై దాడికి దిగడానికి వ్యతిరేకంగా నిరసనను, ప్రతిఘటనను చూపినందుకు దాని అన్ని విభాగాలను, మొత్తం టీ సొసైటీని ఆల్‌ ఇండియా ప్లాంటేషన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐపీడబ్ల్యూఎఫ్‌) అభినందించింది. కామ్రేడ్‌ జియావుల్‌ ఆలంపై తప్పుడు అభియోగాలు మోపారని ఆరోపించింది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. ఉత్తర బెంగాల్‌లోని తోటల సంఘం, దేశంలోని ఇతర సంఘాలు కూడా దీనిపై స్పందించాయి. తమ వారిని బేషరతుగా విడుదల చేయాలంటూ పశ్చిమ బెంగాల్‌కు చెందిన 30కి పైగా టీ ట్రేడ్‌ యూనియన్‌ల సమ్మేళనం పశ్చిమ బెంగాల్‌లోని టీ జిల్లాల్లోని అన్ని పోలీసు స్టేషన్‌లను డిమాండ్‌ చేసింది. ఈనెల 21న, త్రిపుర నుంచి కేరళ వరకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది తేయాకు కార్మికులు తమ తోటల వద్ద ప్రదర్శనలు నిర్వహించారు. తక్షణమే జోక్యం చేసుకుని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ముఖ్యమంత్రి, పశ్చిమ బెంగాల్‌ హౌం మంత్రికి లేఖ పంపారు. సీఐటీయూ పిలుపు మేరకు ఇతర కేంద్ర, ప్రాంతీయ కార్మిక సంఘాలు కూడా సంఘీభావం, మద్దతును అందించాయి. పోరాటాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయి. అన్ని మూలల నుంచి విపరీతమైన ఒత్తిడి, దేశవ్యాప్తంగా ఒత్తిడితో కూడిన ఆందోళనల కారణంగా, కామ్రేడ్‌ జియావుల్‌ ఆలం, ఇతర సహచరులకు 21న జల్పాయిగురి కోర్టు నుంచి బెయిల్‌ మంజూరైంది. పోరాటం ద్వారా సాధించిన విజయానికి ఇది అసాధారణమైన, అద్భుతమైన ఉదాహరణ అని ఫెడరేషన్‌ పేర్కొన్నది. ఈ వీర పోరాటం, విజయం కోసం శ్రామిక ప్రజలందరికీ ఏఐపీడబ్ల్యూఎఫ్‌ శుభాకాంక్షలు తెలియజేసింది.