నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలను అరికట్టాలని ఏఐఎస్‌ఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. ఫీజుల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాయని తెలిపారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.