15న ఛలో హ్తెదరాబాద్ బీడీ కార్మికుల ఆకాలి కేక మహ దర్నా

– జయప్రదం చేయండి
తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్టీయూ పిలుపు
నవతెలంగాణ- కంటేశ్వర్
సెప్టెంబర్ 15న చలో హైదరాబాద్ బీడీ కార్మికుల ఆకలి కేక మహాధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ బహుళ జనగిరి కార్మిక సంఘం బిఎల్టియు పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగళవారం నిజామాబాదు జిల్లా కేంద్రం లో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, రాష్ట్ర కార్యాలయం లో రాష్ట్ర అధ్యక్షులు యస్, సిద్దిరాములు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికలలో బీడీ పరిశ్రమ లో పనిచేయు ,బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, బట్టి, చటన్, టేకేదార్, మునీమ్ తదితరులకు అందరికీ 2016,రూ,ల జీవన భృతి ఇస్తామని వాగ్దానం చేశారు కానీ ఈ రోజు వరకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయలేదు, 2010సంవత్సరంలో బీడీ కార్మిక సంఘం సమ్మె పోరాటం ద్వారా అనాటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 41జిఓఇవ్వడం జరిగింది, ఈ 41,జిఓ అమలు చేయకుండా,81,జిఓ తేవడం ద్వారా బీడీ కార్మికులకు తీరాని అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్రం లో trs,ప్రభుత్వం వచ్చిన వెంటనే 41,జిఓ ప్రకారం బీడీ కార్మికులకు వేతనాలు ఇప్పి ఇస్తామని చెప్పి న ప్రభుత్వం ఈ రోజు వరకు trs, ప్రభుత్వం కార్మికుల కు ఇప్పించాలేదు,కేంద్రం లో ఉన్న బిజెపి ప్రభుత్వం బీడీ పరిశ్రమ ప్తె ఆంక్షలు, కోప్టా చట్టం,GST,పెట్టడం ద్వారా బీడీ పరిశ్రమ లో పనిచేయు కార్మికుల కు ఉపాది లేక నేలలో 10,రోజు లు కూడా పనిలేదు, అందుకని ఇప్పటికే తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, రాష్ట్ర వ్యాప్తంగా, మండల జిల్లా కేంద్రాల్లో వివిధ రూపాలలో ఆందోళన చేయడం జరిగింది, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం లు బీడీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయలేదు అందుకని తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, రాష్ట్ర కమిటీ ఆద్వర్యంలో ,BRS,BJP,పార్టీ లను మినహాయించి అన్ని ప్రతి పక్ష వామపక్ష రాజకీయ పార్టీల మద్దతు వారి వ్తెఖరి ,పోరాటం కు తీవ్రం చేయడం కోసం సెప్టెంబరు 15,న ఛలో హ్తెదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీడీ కార్మికుల అకలి కేక మహా దర్నా కార్యక్రమం కు వేలాది మంది కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని యస్, సిద్దిరాములు పిలుపు నిచ్చారు. సెప్టెంబరు 15,న జరిగే హ్తెదరాబాద్ ఇందిరా పార్క్ దర్నా కు తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, రాష్ట్ర అధ్యక్షులు, యస్, సిద్దిరాములు అధ్యక్షతన జరిగే ఈ మహ దర్నా కు ,బిఎల్ ఎఫ్ రాష్ట్ర చ్తెర్మన్ నల్లా సూర్య ప్రకాష్, సిపిఐయం రాష్ట్రర కార్యదర్శి, తమ్మినేని వీరభద్రం, సిపిఐ,రాష్ట్ర కార్యదర్శి, కూనమనేని సాంబశివరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎ,రేవంత్ రెడ్డి,యం, సిపిఐయు,రాష్ట్ర కార్యదర్శి, గాదగోని రవి,బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పర్వతాలు, బహుజన లెప్ట్ పార్టీ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, దండి వెంకట్,సి,పి,యం, ఎల్ న్యూ డెమోక్రసీ, రాష్ట్ర నాయకులు,జె,వి,చలపతిరావుసి,పి,ఐ,యం, ఎల్, న్యూ డెమాక్రసీ, రాష్ట్ర నాయకులు కా,గోవర్ధన్,ప్రో,మురళి మనోహర్,సామాజిక పొలిటికల్ ఫ్రంట్ చ్తెర్మన్, కా,ప్రసాద్, సి,పి,ఐ,యం ఎల్, రాష్ట్ర కార్యదర్శి, ప్రో,కోదండ రామ్,రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ జన సమితి,సబ్బని లత,బహుజన మహిళా సంఘం, రాష్ట్ర కన్వీనర్‌,యం, ఆంజనేయులు, తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వడ్ల, సాయి కృష్ణ, బి,డి,యస్, ఎఫ్,రాష్ట్ర అధ్యక్షులు,తదితరులు హాజరు ఈ దర్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతారు. ఈ కార్యక్రమం లో పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ విలేకరుల సమావేశంలో, తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, నిజామాబాదు జిల్లా నాయకులు, ప్రకాష్,మల్లేష్,నాగమణి, స్వరూప, జయలక్ష్మి, లావణ్య, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.