న్యూఢిల్లీ: విద్యాసంస్థ ఆకాష్ సిఇఒ, సిఎఫ్‌ఒలు రాజీనామా చేయడంతో దాని మాతృసంస్థ బైజూస్ నూతన నాయకత్వం నియామకానికి ఓ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవల ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ (ఎఇఎస్‌ఎల్) హెడ్ అభిషేక్ మహేశ్వరి, సిఎఫ్‌ఒ విపన్ జోషి వైదొలగడంతో ఆ రెండు స్థానాలు కలిగి ఉన్నాయి. కీలకమైన ఈ హోదాల్లో కొత్త సారథుల కోసం కమిటీని నియమిస్తూ బైజూస్ సిఇఒ రవీంద్రన్ నిర్ణయం తీసుకున్నారు.