అఖిలపక్షాన్ని పంపాలి

– మణిపూర్‌ ముఖ్యమంత్రిని బర్తరఫ్‌ చేయాలి బాధితులకు పునరావాసం కల్పించాలి
– పునరావాస ప్యాకేజీ విడుదల చేయాలి
– అఖిలపక్ష నేతల డిమాండ్‌
– ప్రధాని మోడీ గైర్హాజరుపై నిలదీత
మణిపూర్‌లో పరిస్థితి అదుపులో లేదు : అమిత్‌ షా
మణిపూర్‌లో కేంద్రం రగిల్చిన రిజర్వేషన్ల చిచ్చు రావణకాష్టంలా రగులుతూనే ఉంది. శాంతిభద్రతల అదుపులో బీజేపీ సారధ్యంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. పరిస్థితులు చేయి దాటడంతో తప్పనిసరై కేంద్ర హౌం మంత్రి అమిత్‌షా నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ప్రధాని నరేంద్రమోడీ గైర్హాజరు కావడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. ఇంత జరుగుతున్నా… ఆయన మౌనం దేనికి సంకేతమంటూ ఈ సమావేశంలో ఘాటుగా స్పందించాయి. కేంద్ర వైఫల్యంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న మోడీని ‘గోబ్యాక్‌’ అంటూ అక్కడి భారతీయులు తీవ్రంగా నిరసిస్తున్నారు. భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ, మోడీని ఆ దేశానికి ఆహ్వానించిన బైడన్‌ నిర్ణయాన్నీ తప్పుపడుతున్నారు. మరోవైపు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద మణిపూర్‌ హింస, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను నిరసిస్తూ ఐద్వా సహా 40 సంఘాల నేతృత్వంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మోడీ మౌనాన్ని ప్రశ్నించారు.
   న్యూఢిల్లీ : మణిపూర్‌ పరిస్థితులను చక్కదిద్దేందుకు అఖిలపక్షాన్ని పంపాలని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేశాయి. మణిపూర్‌ వివాదం ముదిరి పాకాన పడుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ మౌనం దాల్చడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. అలాగే మణిపూర్‌ హింసను నిలువరించడంలో విఫలమైన ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ను తక్షణమే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశాయి. అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని కోరాయి. శనివారం నాడిక్కడ పార్లమెంట్‌ లైబ్రరీ బిల్డింగ్‌లో కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన మణిపూర్‌ పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం జరిగింది. దాదాపు మూడు గంటల పాటు సమావేశం జరుగగా, అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకాకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు నిలదీశాయి. మణిపూర్‌లో పరిస్థితి అదుపులో లేదని అమిత్‌ షా తొలిసారి విమర్శించారు.
ఇక తెలంగాణ వచ్చిన తర్వాత డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇస్తామని కేసీఆర్‌ చెప్పడంతో ప్రజలు కండ్లు కాయలు కాసేలా ఎదురు చూసినా అమలు చేయలేదని వాపోయారు. తెలంగా ణలో మేమే అధికారంలోకి వస్తామంటున్న బీజేపీ అధ్యక్షులు బండి సంజరు ఇండ్లు, ఇండ్ల స్థలాలపై మాటెత్తడం లేదని విమర్శించారు. బీజేపీకి మొదటి నుంచీ పేదల సమస్యలు పట్టవని ఆరోపించారు. మోడీకి కుడి ఎడమ భుజంలా అంబానీ, అదానీ ఉన్నారని, వీరుంటే సరిపోతుందని అన్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని పేదలందరికీ 125 గజాల స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి రాష్ట్రం రూ.5 లక్షలు, కేంద్రం రూ.10 లక్షలు సాయం చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గృహలక్ష్మిలో రూ.3 లక్షల సాయంతో పునాదులు కూడా లేవవని, దాంతో పేదలకు ఉపయోగం జరగబోదని స్పష్టం చేశారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్‌ మాట్లాడు తూ.. ధర్మపురి అరవింద్‌ పసుపు బోర్డు హామీ ఎంత జూటానో, మోడీ చెప్పిన అందరికీ ఇండ్లు కూడా అంతే జూటా, మోసం అని విమర్శించారు. పేద ప్రజలకు వ్యతిరేకంగా నిలబడిన ప్రభుత్వాలు ఎక్కువ కాలం నిలబడలేవని హెచ్చరించారు. బడాబాబులు, రియల్టర్లు వందల ఎకరాలు తన్నుకుపోతున్నా పట్టించుకోని సర్కారు పేదలకు తలదాచుకునేందుకు స్థలం కోరితే కేసులు పెడుతూ అరెస్టులు చేస్తున్నారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు పంపిణీ చేయకపోవడం వల్ల పేదలు శివారు ప్రాంతాల్లో, మురికివాడల్లో, పాములతో సావాసం చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు పంపిణీ చేసే వరకు పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు. యాత్రలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ వెంక్రటా ములు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేష్‌, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్‌, సోషల్‌ మీడియా రాష్ట్ర కన్వీనర్‌ జగదీష్‌, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్‌, రాష్ట్ర నాయకులు పర్వతాలు, జిల్లా నాయకులు రమేష్‌బాబు, నూర్జహాన్‌, పెద్ది వెంక్రటాములు, గంగాధరప్ప, వెంకటేష్‌, సుజాత, శంకర్‌గౌడ్‌, గోవర్ధన్‌, పెద్ది సూరి, అనిల్‌, విఘ్నేష్‌ తదితరులు పాల్గొన్నారు.