మద్యానికి బానిసై ఒకరి అత్మహాత్య..

నవతెలంగాణ -డిచ్ పల్లి
డిచ్ పల్లి పోలిస్ స్టేషన్ పరిధిలోని  ఘనపూర్ గ్రామానికి చెందిన  కొక్కుల గంగాధర్ 57 మద్యానికి  బానిసై ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ ఐ మహేష్ తెలిపారు.అయన తెలిపిన వివరాల ప్రకారం ఘన్పూర్ గ్రామానికి చెందిన కోక్కుల గంగాధర్ గత కొన్ని రోజులుగా మద్యనికి బానిసై జీవితం పై విరక్తి చెంది తన ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఇంటికి గల దూలం కు కాటన్ బట్ట తో ఉరి వేసుకొని ఆత్మహత్యా చేసుకున్నాడని వివరించారు. మృతుని భార్య కోక్కుల పద్మ  ఫిర్యదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర మార్చురీకి తరలించినట్లు ఎస్సై తెలిపారు.