జీనత్ సుమైరాకు డాక్టరేట్ ప్రదానం..

నవతెలంగాణ డిచ్ పల్లి:
పీహెచ్‌డీ తెలంగాణ యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగంలో జీనత్ సుమైరా వైవా వోస్ నిర్వహించి డాక్టరేట్ పట్టాను శనివారం ప్రధానం చేశారు. “క్యామెల్ మోడల్‌ ని ఉపయోగించి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మరియు పంజాబ్ & సింద్ బ్యాంక్ ఆర్థిక పనితీరుపై సేవా నాణ్యత ప్రభావంపై అధ్యయనం” అనే అంశంపై తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె. అపర్ణ పర్యవేక్షణలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జయచంద్రారెడ్డి ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్‌గా పాల్గొని పలు ప్రశ్నలు అడిగి సమాదానాలు రాబట్టి సంతృప్తి చెందారు.భ్యాంకుల సేవా నాణ్యత మెరుగుపడితే బ్యాంకు ఆర్థిక పనితీరు కూడా మెరుగుపడుతుందని పేర్కొన్నారు. బ్యాంక్ వారి సేవా నాణ్యతను మెరుగుపరచడానికి తక్షణ సేవలను అందించాలని ,పరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్వహించాలని సూచించారు.

Spread the love