– మార్కెట్ లో నకిలీల బెడద.
– ఎరువులు, విత్తనాలపై అవగాహన అవసరం
నవతెలంగాణ-మల్హర్‌రావు
మండల వ్యాప్తంగా రైతులు వానాకాలం పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. దుక్కులు దున్ని, పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేస్తున్నారు. అయితే మార్కెట్ లో నకిలీల బెడద ఎక్కువగా ఉన్నందున రైతులు అప్రమత్తంగా లేకుంటే మోసపోయే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులకు అప్రమత్తతే అసలైన ఆయుదమని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. అధిక లాభాల కోసం విత్తనాల, ఎరువుల యజమానులు నకిలివి అంటగట్టే అవకాశాలు ఉన్నాయి కావున అప్రమత్తత అవసరం. వ్యవసాయశాఖ లైసెన్స్ పొందిన డీలర్ల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి.విక్రయదారు ఇచ్చే కరపత్రాలను తీసుకొని వాటిలో పేర్కొన్న అంశాలను చదవాలి.బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలి.బిల్లుపై విక్రయదారు పెరు, కేంద్ర,రాష్ట్ర అమ్మకపు పన్ను నెంబర్, రైతు పెరు, గ్రామం పెరు, విక్రయదారు సంతకం తేదీలు,రకం పెరు, బ్యాచ్ నెంబర్, రకం పెరు, గడువు తేదీలు, నికర తూకం, కంపెనీ పెరు ఉన్నాయో లేవో సరిచూసుకోవాలి. ఎఅరువు పద్దతిలో కొనుగోలు చేసినా తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. లూజుగా ఉన్న మందులు, పగిలిన ప్యాకెట్లు, తెరిసిన డబ్బాల నుంచి విత్తనాలు కొనద్దు.కొనుగోలు చేసే విత్తన ప్యాకెట్, సిసా, సంచి, డబ్బాలపై సిలు ఉందొ లేదో నిర్దారించుకోవాలి.కొనుగోలు చేసిన సరుకును డీలర్ వద్దే తూకం వేయించాలి.విత్తనాలు కొనుగోలు చేసిన బిల్లులను పంట కాలం పూర్తియ్యే వరకు దాచిపెట్టుకోవాలి.విత్తనాలు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చిన తరువాత మొలక శాతాన్ని చూసుకోవాలి.మొలక శాతం సంతప్తికరంగా ఉంటేనే విత్తనాలుగా వాడుకోవాలి. మొలకెత్తే దశ, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి.డీలర్ల నుంచే ఎరువులు కొనుగోలు చేయాలి.మిషన్ కుట్టుతో ఉన్న ఎరువుల సంచులనే కొనాలి.ఒకవేళ చేతికుట్టు ఉంటే సీసం సిల్ ఉందొ లేదో చూసుకోవాలి.ప్రామాణిక పోషకాల వివరాలు, ఉత్పత్తి చేసిన సంస్థ, ఉత్పత్తి దారుడి పెరు ఉంటేనే కొనాలి.చిల్లులు పడి చిరిగిన ఎరువుల బస్తాలను కొనొద్దు.అన్యపదార్థాలు కలిస్తే ఆ ఎరువు కల్తిగా గుర్తించాలి.కొనుగోలు సమయంలో డీలర్ రికార్డులో రైతు విధిగా సంతకం చేయాలి.ఎరువుల నాణ్యతపై అనుమానం ఉంటే వెంటనే వ్యవసాయశాఖ అధికారి సహాకారంతో ఎరువులను పరీక్షలకు పంపించాలి.
పురుగుల మందుల విషయంలో…
వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచనల మేరకే పురుగుల మందులు కొనాలి. పురుగుమందు డబ్బాలపై డైమండ్ ఆకారంలో పురుగుమందు స్థాయిని తెలిపే రంగులు ఉంటాయి.అత్యంత విషపూరితమైతే ఎరుపు రుగు, విషపూరితమైతే నీలం రంగు, స్వల్ప విషపూరితమైతే ఆకుపచ్చ రంగు గుర్తులుంటాయి. పురుగుమందులు రెండుమూడు కలిపి వాడతారు.వాడిన డబ్బాలు, సీసాలను ధ్వంసం చేసి గోతిలో పూడ్చి పెట్టాలి. పురుగుల మందుల వాడకానికి వినియోగించిన పాత్రలను ఇతర అవసరాలకు వినియోగించవద్దు.