
నేషనల్ హెల్త్ మిషన్ స్కీములో దాదాపు 17 వేల మంది కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పద్ధతిన వివిధ విభాగాలలో విధులు నిర్వహిస్తున్నారని గత చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్న వీరందరినీ వెంటనే పర్మనెంట్ చేయాలని ఎన్ హెచ్ ఎం రాష్ట్ర అధ్యక్షులు ఎం నరసింహ, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు. శుక్రవారం ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ)ఆధ్వర్యంలో కోఠి లోని ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయం ముందు కార్మికులతో మహాధర్న నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహ, రామ రాజేష్ ఖన్నా లు మాట్లాడుతూ.. ఆల్ క్యాడర్స్ ఉద్యోగులందరిని గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేయాలని, అప్పటివరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు విడుదల చేసిన 510 జీవో ద్వారా వీరికి తీవ్ర నష్టం జరిగిందని, చట్ట ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ వేతనం ఈ సిబ్బందికి అమలు చేయాల్సి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. ఎన్ హెచ్ ఎం స్కీములో పనిచేస్తున్న డాక్టర్లను ఏ మాదిరిగా రెగ్యులరైజ్ చేశారు అదే మాదిరిగా మిగతా ఎన్ హెచ్ ఎం ఆల్ క్యాడర్స్ ఉద్యోగులందరిని కూడా క్రమబద్ధీకరించాలని లేనిపక్షంలో రాబోవురోజులు సమ్మెతో సహా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించినట్లు వారు హెచ్చరించారు, పి.ఆర్.సీ ఏరియర్స్ 7 నెలలు కొత్త బడ్జెట్ లో రిలీజ్ చేయాలని రామా రాజేష్ కన్నా వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కోరారు, తదుపరి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని రామ రాజేష్ ఖన్నా ఏఐటియుసి ఆధ్వర్యంలో ఐఏఎస్ ఆర్.వి కర్ణన్ ఇచ్చారు. కమిషనర్ ఆర్వి. కర్ణన్ మాట్లాడుతూ మొన్న స్టాఫ్ నర్స్ లకు ,ల్యాబ్ టెక్నిషన్లకు, ఏఎన్ఎమ్ లకు 14 వ తారీకు వీరికి వేతనాలు ఒక నెల పడ్డాయని , మిగతా ఉద్యోగులకు ఒక నెల వేతనం మంగళవారం లోపు అనగా 20 తారీకు 20 ఫిబ్రవరి 2024 పడతాయని చెప్పారు. ఇట్టి ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బాల సుబ్రమణ్యం, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సిద్దిపేట రాజేశ్వరి రెడ్డి, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్లు దుర్గా , ఎల్ స్వప్న, సరికొండ సురేష్ గౌడ్,మధు, హన్మంత్, శిరీష, వసుంధర,అశ్విని, నీరజ,లక్ష్మి, విజయ, కేతన్., డిప్యూటీ సెక్రటరీ బాపు యాదవ్, ఎగ్జిక్యూటివ్ నెంబర్స్, మురళి, సుమన్, ఉప్పలయ్య , స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ సంపత్ కుమార్ ఓ సందీప్ కుమార్, నరసింహ, ఆర్ బి ఎస్ కే మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ రవీందర్ ,డాక్టర్ దుర్గాప్రసాద్ , డాక్టర్ కుమార్, పృద్వి , అనూష , లలిత, సురేష్, పావని, సునీత , అనిత , సాగర్. శ్రీమణి జైపాల్ , లలిత , లోకేష్ , ఉమా , సరస్వతి, జ్యోతి, రవీందర్, ఆయుష్ డిపార్ట్మెంట్ శ్రీనివాస్, సావిత్రి , అజ్మత్ , జోగలక్ష్మి ఎమ్మె ఎల్ హెచ్ పి డాక్టర్స్ సెకండ్ ఏఎన్ఎంలు కాంటి జెంట్ వర్కర్లు, సపోర్టింగ్ స్టాప్, టిబి వింగ్ తదితరులు పాల్గొన్నారు.