రాముడిని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడమే మిగిలింది..

Rama as BJP candidate All that remains is to announce..–  బీజేపీపై సంజయ్ రౌత్‌ విమర్శలు..!
ముంబయి: ఉద్ధవ్‌ ఠాక్రే నేతత్వంలోని శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ మరోసారి బీజేపీని టార్గెట్‌ చేశారు. రాముడి పేరుతో చాలా రాజకీయాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం ఇంకా మిగిలిన ఏకైక విషయం ఏంటంటే.. అయోధ్య లేదంటే మరేదైనా ప్రాంతం నుంచి రాముడిని తమ అభ్యర్థిగా బీజేపీ త్వరలో ప్రకటించనుందంటూ ఎద్దేవా చేశారు. శివసేన నేత శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌ను జీరో అనడంపై క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్‌ను తాను ఎప్పుడూ జీరో అనలేదని ఎంపీ చెప్పారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. కాంగ్రెస్‌ నుంచి సున్నా నుంచి ప్రారంభమవుతుందని నేను చెప్పానని.. కాంగ్రెస్‌ జీరో అని ఎప్పెడూ చెప్పలేదన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఒక్క కాంగ్రెస్‌ ఎంపీ కూడా లేరని.. తమకు 18 మంది ఎంపీలు ఉన్నారన్నారు. ప్రస్తుతం మాకు ఆరుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారన్నారు. మా కూటమి కాంగ్రెస్‌తో ఉందని.. మహా వికాస్‌ అఘాడి దాదాపు 40 సీట్లు గెలుస్తుందన్నారు.