కాంగ్రెస్ లో  గెలిచిన వారంతా సీఎం అభ్యర్థులే

– 100 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం
– ఎంపీ కోమటిరెడ్డి
– ఎంపీ సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిక
 నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లతో అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం నలగొండ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో నల్గొండ పట్టణం మూడో వార్డు పాతపల్లె, మండలంలోని కాజీరామారం గ్రామానికి చెందిన బీసీ సంఘం నేతలు బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి ఎంపీ హస్తం కండువాలు కాఫీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి  మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీములను పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీలకైకంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగినది స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకుంటామని అన్నారు. కాంగ్రెస్ లో గెలిచిన వారంతా సీఎం అభ్యర్థులే,ఎవరైనా సీఎం  కావచ్చని మరోసారి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ లో మాత్రం కేసీఅర్,కేటీఆర్,హిమాన్ష్ తప్పా ఎవరూ సీఎం అయ్యే ఛాన్స్ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా అవకాశం ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోనే బీఆర్ఎస్ కాపి కొట్టిందని విమర్శించారు. నల్లగొండ నియోజకవర్గ ప్రజలంతా మరోసారి ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో తాను ఏ స్థాయిలో ఉన్న నల్గొండ అభివృద్ధి తన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.