జహీరాబాద్‌ నిధులన్నీ సిద్దిపేట, గజ్వేల్‌కు..

– కాంగ్రెస్‌ అభ్యర్థి ఏ.చంద్రశేఖర్‌
నవతెలంగాణ-జహీరాబాద్‌
జహీరాబాద్‌ ప్రజలు కట్టిన పన్నులను హరీశ్‌రావు ఎత్తుకుపోతుంటే కనీసం ప్రశ్నించలేని అసమర్ధ వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే అని మాజీ మంత్రి, జహీరాబాద్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఏ.చంద్రశేఖర్‌ విమర్శించారు. గురువారం ‘వస్తున్నా.. మీ కోసం’ కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్‌ మండలం హగ్గెల్లి, హగ్గెళ్ళి తండా, అల్గోల్‌, దిడ్గి, కోత్తుర్‌ (బి), బుర్దిపడ్‌, తుంకుంట, భూచినెళ్ళి, సత్వర్‌, చిరక్‌పల్లి, ముర్‌తండాలో కాంగ్రెస్‌ అభ్యర్థి చంద్రశేఖర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జహీరాబాద్‌కు నిధులు తేవడంలో ఎమ్మెల్యే విఫలం చెందారన్నారు. జహీరాబాద్‌ పట్టణం పక్కనే ఉన్న గ్రామాలను మున్సిపాలిటీలో కలిపి అన్యాయం చేశారన్నారు. మున్సిపాలిటీని నిర్లక్ష్యం చేశారన్నారు. మళ్లీ కొత్తగా గ్రామాలను కలిపి అభివద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్‌ చెయ్యిగుర్తుకు ఓటు వేసి తనను గెలిపించిన వెంటనే రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తానన్నారు. ఎమ్మెల్యే వస్తే ప్రజలు స్వాగతం పలకాలి… ఇక్కడ ప్రజలు అడ్డుకుని తరిమికొడుతున్నారని అన్నారు. పనికిమాలిన ఎమ్మెల్యే కాబట్టే ప్రజలు ఛీ కొడుతున్నారన్నారు. జహీరాబాద్‌కు ఎన్నో పరిశ్రమలు, కంపెనీలు వచ్చినా అభివద్ధి కాలేదన్నారు. ఉద్యోగాల విషయంలో స్థానికులకు అన్యాయం చేసి సిద్దిపేట, గజ్వేల్‌కు దోచిపెట్టారన్నారు. సోనియా గాంధీ కషితో తెలం-ాణ రాష్ట్రం వచ్చిందని, కేసీఆర్‌ దొంగ దీక్షలతో కాదని, జహీరాబాద్‌ నియోజకవర్గం ప్రజలంతా కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని తెలిపారు.జహీరాబాద్‌ మండల అధ్యక్షులు నరసింహ రెడ్డి, పాల్గొన్నారు.