పటానుచెరుతో పాటు మరో స్థానం కేటాయించండి

– సీఎంకు నీలం మధు వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వచ్చే ఎన్నికల్లో ముదిరాజ్‌ కులస్థులకు సముచిత స్థానం కల్పించాలని నీలం మధు ముదిరాజ్‌ బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సీఎంను కలిశారు. తమ సామాజిక వర్గానికి రెండు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పటానుచెరుతో పాటు మరో స్థానం ఇవ్వాలని కోరారు. ముదిరాజ్‌ సామాజిక వర్గాన్ని బీసీ డీ నుంచి బీసీ ఏలోకి మార్చాలనీ, ప్రభుత్వ పదవుల్లోనూ అవకాశం ఇవ్వాలని కోరారు. అమెరికా నుంచి మంత్రి కేటీఆర్‌ వచ్చిన తర్వాత ఈ విషయంపై చర్చిస్తామంటూ సీఎం హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు.