వడ్డెర ఆత్మగౌరవ భవనానికి ఎకరం స్థలం కేటాయింపు

ట్రస్ట్‌ చైర్మెన్‌ సత్యనారాయణ రాజు
నవతెలంగాణ-ముషీరాబాద్‌
వడ్డెరల ఆత్మగౌరవ భవన నిర్మణానికి రాష్ట్ర ప్రభుత్వం ఉప్పల్‌ భగయాత్‌లో ఎకరం స్థలంతో పాటు భవన నిర్మాణా నికి రూ.1 కోటి నిధులు కేటాయించినట్టు వడ్డెర ఆత్మగౌరవ భషన్‌ ట్రస్టు చైర్మెన్‌ జెరిపేటి సత్యనారాయణ రాజు తెలి పారు. వడ్డెరల ఆత్మగౌరవ భవన నిర్మాణం, భవి ష్యత్తు కార్యచరణ, ఆత్మగౌరవ భవనంలో ఎలాంటి వస తులను ఏర్పాటు చేసుకోవాలనే అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజ కవర్గాల వారీగా విస్తత స్థాయి ముఖ్య నాయకుల సమావేశం డాక్టర్‌ ఓర్సు కష్ణయ్య అధ్యక్షతన బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్‌ చైర్మెన్‌ సత్య నారాయణ రాజు మాట్లాడుతూ త్వరలో ఉప్పల్‌ భగాయత్‌లో నిర్మాణం కానున్న వడ్డెర ఆత్మగౌరవ భవనాన్ని 5 అంతస్తుల్లో నిర్మాణం చేయనున్నట్టు చెప్పారు. ఈ భవనంలో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు ప్రత్యేక వసతి సౌకర్యం కల్పి స్తామన్నారు. గ్రంథాలయం, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి విశ్రాంతి గదులు, ఫంక్షన్‌ హాల్‌ తదితర వస తులు ఉండేలా ప్లానింగ్‌ చేస్తున్నట్టు తెలియజేశారు. కార్యక్రమం లో వైస్‌ చైర్మెన్‌ ఎత్తరి అంతయ్య, డైరెక్టర్లు డాక్టర్‌ ఓర్సు కష్ణయ్య, బండారు శ్రీరాములు, తన్నీరు వెంకటకష్ణ, మక్క ల పెంటేష్‌, ముద్దంగుల నరసింహ్మా, గుంజ సాయికష్ణ, వరికుప్పల లింగయ్య, డి. అనంత రావు, ఎత్తరి మోహన్‌ కుమార్‌, వల్లెపు వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.