యువతకు అల్లూరు సీతారామరాజు ఆదర్శప్రాయుడు

– ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
నవతెలంగాణ-మియాపూర్‌
యువతకు అల్లూరు సీతారామ రాజు ఆదర్శ ప్రాయుడు అని ప్రభుత్వం విప్‌, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. అల్లూరి సీతరామరాజు 126వ జయంతిని పురస్కరించుకుని మియాపూర్‌ డివిజన్‌ పరిధిలోని జే.పీ. నగర్‌లో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్‌ జగదీశ్వర్‌గౌడ్‌, నార్నె శ్రీనివాస రావులుతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత దేశ స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన మహనీ యుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. మన్యం ప్రజల్లో విప్ల బీజాలు నాటి ప్రజలను చైతన్య పరిచి, స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనేలా చైతన్య పరిచారని ఆయన సేవ లను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గంగాధర్‌, కిరణ్‌ యాదవ్‌, చంద్రికప్రసాద్‌, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాసరావు, దుర్గరాజు, పవన్‌, రంగరాజు, కృష్ణంరాజు, గంగాధర్‌, దీప్తి కృష్ణంరాజు, కాట్రగడ్డ సత్యనారాయణ, వర్మ, శివ, బలరామకృష్ణ, రవి, సత్యనారాయణ రాజు, సూరి, నాగ రాజు, క్షత్రియ యూత్‌ అసోసియేషన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.