బీసీ స్టడీ సర్కిళ్లలో గురుకులాల ఉపాధ్యాయులకు కోచింగ్‌ : డైరెక్టర్‌ అలోక్‌కుమార్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలోని అన్ని టీఎస్‌బీసీ స్టడీ సర్కిళ్లలో బుధవారం నుంచే గురుకులాల్లో ఉపాధ్యాయులకు కోచింగ్‌ ఇస్తున్నట్టు స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ అలోక్‌ కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ (ఏ,బీ,డీ గ్రూపు) కమ్యూనిటీకి చెందిన అభ్యర్ధులు డిగ్రీ, బీఈడీ లో 40శాతం ఆపైన ఉత్తీర్ణులైన వారు వెంటనే నేరుగా టీఎస్‌ స్టడీ సర్కిల్‌, ఓ.యూ. సెంటర్‌, తార్నాక హైదరాబాద్‌లో గురుకులం కోచింగ్‌ ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ. ఐదు లక్షలలోపు ఉండాలని తెలిపారు. అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం స్టడీ మెటీరియల్‌ అందిం చనున్నట్టు తెలిపారు. ఇతర వివరాల కోసం .040- 2407- 1178, 040-27077929 ని సంప్రదించాలని సూచించారు.