అరుదైన సినిమాకి అద్భుత ఆదరణ

సముద్ర ఖని, మాస్టర్‌ ధ్రువన్‌, అనసూయ భరద్వాజ్‌, రాహుల్‌ రామకష్ణ, ధనరాజ్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘విమానం’. శుక్రవారం వరల్డ్‌ వైడ్‌గా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌ రిలీజై సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. శివ ప్రసాద్‌ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్‌, కిరణ్‌ కొర్రపాటి (కిరణ్‌ కొర్రపాటి క్రియేటివ్‌ వర్క్స్‌) ‘విమానం’ చిత్రాన్ని నిర్మించారు.
శనివారం ఈ మూవీ సక్సెస్‌ మీట్‌లో సముద్ర ఖని మాట్లాడుతూ ‘విమానం రిలీజ్‌ తర్వాత థియేటర్స్‌ సంఖ్య పెరిగాయని నిర్మాతలు చెప్పటం చాలా హ్యాపీగా అనిపించింది’ అని అన్నారు.
‘కాన్సెప్ట్‌, కథలోని ఎమోషన్స్‌ కనెక్ట్‌ కావటంతో మౌత్‌ టాక్‌ కారణంగా మ్యాట్నీ నుంచి సినిమాకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు థియేటర్స్‌ సంఖ్య పెరిగింది. ఇలాంటి ఎమోషనల్‌ మూవీ అరుదుగా వస్తుంటుంది’ అని నిర్మాత కిరణ్‌ కొర్రపాటి చెప్పారు. డైరెక్టర్‌ శివ ప్రసాద్‌ యానాల మాట్లాడుతూ ‘సినిమాను చూసిన వారందరూ గొప్పగా చెబుతున్నారు. మా నాన్న సినిమా చూశారు. ఎలా ఉంది నాన్నా అని అడిగితే.. మా నాన్న గుర్తుకొచ్చాడులేరా అని ఆయన, అలాగే మా అమ్మ కూడా చెప్పడం చాలా ఆనందమేసింది. అరుదైన సినిమాకి అద్భుత ఆదరణ లభించడం హ్యాపీ’ అని తెలిపారు.