అంబేడ్కర్ నగర్ ఎంపిపిఎస్ ముందస్తు సంక్రాంతి వేడుకలు


నవతెలంగాణ వీర్నపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో, గర్జన పల్లి గ్రామం లోని అంగన్వాడి కేంద్రంలో ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లలతో వివిధ వేషధారణలతో పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు రైతులు కష్టపడి పనిచేసే పండించిన పంట ఇంట్లోకి తెచ్చుకొని కొత్త సంబరాలతో కొత్త వంటలతో సంక్రాంతి పండగ జరుపుకుంటారని తెలిపారు. ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలతో పిల్లలు అలరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు వకుళ, ఎస్ ఎం సి చైర్మన్ జోసెఫ్, ఉపాధ్యాయులు నాగమణి, అంగన్వాడీ టీచర్ సుశీల , వినయ కుమారి విధ్యార్థులు ఉన్నారు.