అంబర్ పేట నియోజకవర్గం పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు

padmashali
padmashali

నవ తెలంగాణ – అంబర్ పేట

అంబర్ పేట నియోజకవర్గం పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని సంఘం అధ్యక్షులు వర్కాల కృష్ణ ఏర్పాటు చేశారు. సంగం వ్యవస్థాపక అధ్యక్షులు కత్తుల సుదర్శన్ రావు, గౌరవ అధ్యక్షులు ఎనుగంటి నరేందర్ లతో కలిసి వర్కాల కృష్ణ కార్యవర్గాన్ని ప్రకటించారు. సంఘం ఉపాధ్యక్షులుగా ఎలగందుల అంజయ్య, గంగిశెట్టి సత్తయ్య, కుందన సత్యనారాయణ లు, ప్రధాన కార్యదర్శిగా చిలుక శివకుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా గంజి వెంకటరమణ, తీగల నరేందర్ లు, జాయింట్ సెక్రటరీలుగా భోగ వెంకటయ్య, గంధ మల్ల శ్రీనివాస్, చిప్ప శ్రీనివాస్, గంగిశెట్టి మల్లేష్, పెద్ద బొమ్మ మధుసూదన్ లు, కోశాధికారిగా భీమనపల్లి అశోక్ కుమార్, కార్యవర్గ సభ్యులుగా ఆవుల రాములు లను నియమించారు. సంఘం ప్రధాన సలహాదారులుగా డాక్టర్ మార్తా రమేష్, పుట్ట పాండురంగయ్య, నక్క రమేష్, డాక్టర్ జి వి రాజా లు కొనసాగనున్నారు. సంగం న్యాయ సలహాదారులుగా ప్రొఫెసర్ తాటికొండ వెంకట రాజయ్య ను నియమించారు. అలాగే డివిజన్ అధ్యక్షులను కూడా ప్రకటించారు. గోల్నాక డివిజన్ అధ్యక్షులుగా పెద్ద బొమ్మ దామోదర్, ఉపాధ్యక్షులుగా ఇడెం ధనుంజయ, ప్రధాన కార్యదర్శిగా కోట వెంకటేష్, బాగ్ అంబర్ పేట డివిజన్ అధ్యక్షులుగా కాడిగే శ్రీనివాస్, నల్లకుంట డివిజన్ అధ్యక్షులుగా గుర్రం శ్రీనివాస్ లను నియమించారు.