
నవతెలంగాణ-కోహెడ
అత్యవసర పరిస్థితులలో 108 అంబులెన్స్ ప్రజలకు అండగా నిలుస్తుందని హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే వొడితేల సతీష్ కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నూతన 108 అంబులెన్స్ వాహనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోహెడ మండలానికి అడగగానే 30 లక్షల విలువ గల అంబులెన్స్ వాహనాన్ని మంజూరు చేసినందుకు వైద్య ఆరోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరిశ్ రావు కు కృతజ్ఞతలు తెలిపారు. మండల కేంద్రం నుండి 15 కిలోమీటర్ల పరిధిలో ఈ అంబులెన్స్ సేవలు అందిస్తుందని, ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి వివిధ పథకాలను ప్రవేశపెట్టిందని కెసిఆర్ కిట్టు, ఉచితమందుల పంపిణీ, డయాగ్నెట్స్టిక్ సేవలు, వివిధ పరీక్షల కోసం ల్యాబ్ సౌకర్యం ఆసుపత్రుల లో ప్రవేశపెట్టిందని ఆసుపత్రిలో డాక్టర్లు, స్టాప్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా ఒకప్పుడు నేను రాను బిడ్డ సర్కారు దావకానకు అనే పరిస్థితి నుండి నేను సర్కారు దావకానకే పోతాను అనే విధంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని మంజూరు చేయడం జరిగిందని ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడు పాటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్, ఫ్యాక్స్ చైర్మన్ పెర్యాల దేవేందర్ రావు, పార్టీ మండల అధ్యక్షుడు ఆవుల మహేందర్, డాక్టర్ నిమ్రా తరుణమ్, నాయకులు కొక్కుల సురేష్, జాలిగాం శంకర్, తిప్పారపు శ్రీకాంత్, తిప్పారపు నాగరాజు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఎంపీటీసీలు సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.