కాంగ్రెస్ పార్టీ అసత్యపు ప్రచారం మానుకోవాలి: ఏఎంసి చైర్మన్ హనుమంత్ రెడ్డి

నవతెలంగాణ-భిక్కనూర్
కాంగ్రెస్ పార్టీ అసత్యపు ప్రచారాలు మానుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి తెలిపారు. బుధవారం అయన విలేకరుల సమావేశంలో‌ మాట్లాడుతూ.. పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు అసత్యపు ప్రచారం చేయడం సిగ్గుచేటని, బిఆర్ఎస్ పార్టీ నుండి ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకొవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సాయ గౌడ్, నాయకులు రాజలింగం, రాములు, తదితరులు పాల్గొన్నారు.