సమాజ సేవ చేస్తే డబ్బు ఎక్కడిది ఏఎంసీ చైర్మన్.. మండిపడ్డ మున్నూరు కాపు సమాజం

నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సంగమేశ్వర్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మున్నూరు కాపు సమాజం ఏకమైంది మద్నూర్ మండల కేంద్రానికి చెందిన మున్నూరు కాపు ముద్దుబిడ్డ పశు వైద్య డాక్టర్ బండి వార్ విజయ్ సామాజిక సేవలో భాగంగా మద్నూర్ మండలంలోని కొడిచెర గ్రామంలో బసవేశ్వర విగ్రహ ప్రతిష్టాపన కోసం ఆ గ్రామస్తులు డాక్టర్ విజయ్ బండి వార్ వద్దకు వచ్చి సామాజిక సేవ చేయాలని కోరడంతో విగ్రహ ప్రతిష్టాపన కోసం 21 వేల రూపాయలు విరాళంగా అందించిన డాక్టర్ పై ఏఎంసీ చైర్మన్ కొడిచెర గ్రామ నివాసుడైన సంగమేశ్వర్ నీ దగ్గర డబ్బులు ఎక్కడివి అంటూ అనుచిత వ్యాఖ్యలతో ఆరోపణలు చేయడమే కాకుండా తనపై దాడికి ప్రయత్నించారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు దానికి నిరసనగా బాన్స్వాడ డివిజనల్ పరిధిలోని మున్నూరు కాపు సమాజ నాయకులందరూ ఏకమయ్యారు మున్నూరు కాపు ముద్దుబిడ్డపై ఏఎంసీ చైర్మన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకుంటామా అంటూ మద్నూర్ మండల కేంద్రంలోని డాక్టర్ బండి వార్ విజయ్ ఇంట్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా మున్నూరు కాపు నాయకులందరూ ఏకతాటిపై వచ్చి విలేకరులతో మాట్లాడుతూ ఖబర్దార్ కొడకా సామాజిక సేవ చేస్తే ఓరువలేక డబ్బు ఎక్కడిది అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తావా మా జోలికి వస్తే మున్నూరు కాపుల తడాఖా ఏమిటో చూపిస్తాం కొడకా చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని మున్నూరు కాపు ముద్దుబిడ్డ అయినా డాక్టర్ బండి వార్ విజయ్ కి క్షమాపణ చెప్పాలని బాన్సువాడ డివిజనల్ పరిధిలోని మున్నూరు కాపు సమాజ నాయకులు హెచ్చరికలు జారీ చేశారు క్షమాపణ చెప్పకపోతే మా సత్తా ఏమిటో చూపిస్తామని ఏఎంసీ చైర్మన్ కు హెచ్చరికలు జారీ చేశారు అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏఎంసీ చైర్మన్ సంగమేశ్వర్ పై కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ విలేకరుల సమావేశంలో పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ వివిధ పార్టీలకు చెందిన మున్నూరు కాపు కుల సంఘాల నాయకులు మున్నూరు కాపులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.