అర్ధరాత్రి నాన్న తలుపు తెరిచాడు
అమ్మ ఆదుర్దాగా లేచి వెన్ను తట్టింది
ఎక్కడ బుద్ధుడు ఆయి పోతాడో అని బెంగ
అన్న నిద్రలో ఎవరి పేరో కలవరిస్తున్నాడు
అమ్మ నోట్‌బుక్‌లు మొత్తం వెతికినది
రాధ ఎవరురా అని తెల్లవారి నిలదీసింది
అలారం పూర్తి కాకుండానే లేచింది
ఇడ్లీ పిండి పులుపు ఎక్కకూడని టతీఱసస్త్రవలో పెట్టింది
రెండో అలారం పెట్టుకుని తల దిండు కింద దూరింది
మద్యలో లేచి నప్పుడల్లా
పరికిణీ సవరించి బెడ్ షీట్ పరిచి పెట్టి
అమ్మాయి ఎదుగుతుంటే అమ్మకు దిగులు మొదలు
కామాలే కాని ఫుల్‌స్టాప్ లేని పనులు
పుట్టుకతోనే వర్క్ ఆర్డర్ పట్టుకుని వచ్చినట్లు
ప్రశాంతమైన నిద్ర కూడా నోచుకోని జీవితం
అమ్మ డేలో వర్క్ మెన్ నైట్‌లో వాచ్ మెన్
కలలో కూడా కుటుంబ కలవరింతే…..
– దాసరి మోహన్, 9985309080