మామిడిపల్లిలో అమృత మహోత్సవం

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని మామిడిపల్లి గ్రామంలో అమృతు మహోత్సవంలో భాగంగా ఆర్మీ జవాన్లని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు రామవాత్ సురేష్ అధ్వర్యంలో సన్మానం బుదవారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్ మహోత్సవంలో భాగంగా మండలంలోని మమీడిపల్లి  గ్రామంలో ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులు, ఆర్మీ జవాన్ లను గుర్తించి వారి కష్టాన్ని వారు చేసిన సర్వీస్ను స్మరించి వారి కుటుంబ సభ్యులు ఉద్యమంలో చేసినటువంటి త్యాగాలను స్మరించుకుంటూ వారి విలువలను నెమరేసుకుంటూ దేశ సేవ కోసం వారు చేసిన సేవలను గుర్తిస్తూ సన్మానించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్, గంగోని వినోద్, ఆర్మూర్ మండల గోవింద్ పెట్ ఎంపీటీసీ యాల రాజ్ కుమార్, మాక్లూర్ మండల నాయకులు బొబిలి రమేష్, శివలాల్, సంజీవ్, మహేష్, శ్రీనాథ్, బాలు, పట్టేవారు రాజు, శివసాయి, చిన్నయ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.