జీవో 111పై అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి  సీఎంకు కూనంనేని లేఖ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
జీవో 111 ఎత్తివేతపై నిపుణులు, పర్యావరణవేత్తలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖరాశారు. ‘ఎలాంటి పరిమితులు లేకుండా జీవో 111ను ఎత్తివేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనిపై పర్యావరణవేత్తలు, ప్రజలలో తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి’ అని తెలిపారు. ఈ జీవో ఎత్తివేత ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ పరిధిలోనున్న లక్షల ఎకరాల పరివాహక ప్రాంతాల్లో భూగర్భజలాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని భావిస్తున్నారని పేర్కొన్నారు.