ఏసీపీగా పదోన్నతి పొందిన ఆర్మూర్ వాసి

నవతెలంగాణ- ఆర్మూర్ :  పట్టణంలోని రాజారాం నగర్ కాలనీకి చెందిన మధనం గంగాధర్ ఏసీపీగా పదోన్నతి పొందినారు. నల్గొండ జిల్లాలో ఎస్సైగా పనిచేస్తూ రంగారెడ్డి తదితర ప్రాంతాల నుండి స్పెషల్ బ్రాంచ్ ఇన్వెస్టిగేషన్ బృందంలో సీఐగా కొనసాగుతున్నారు. శనివారం సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సందీప్ శాంధిలియా ను మర్యాదపూర్వకంగా కలిసినారు . చిన్ననాటి నుండి కష్టపడి చదువుకొని ఏసీపీ గా పదోన్నతి పొందడం పట్ల పట్టణానికి చెందిన గంగాధర్ మిత్రబృందం అభినందనలు తెలిపారు.