– ఆదర్శ వివాహానికి అండగా నిలిచిన బయ్యారం ఎస్సై
నవతెలంగాణ-పినపాక
భారత రాజ్యాంగం ప్రకారం మేజర్ అయిన ప్రతి ఒక్క యువతీ, యువకులు వారికి రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హక్కు ప్రకారం వారి జీవిత లక్ష్యాలను నిర్ణయించు కునే అధికారం ఉందని ఏడూళ్ల బయ్యారం సబ్ ఇన్స్పెక్టర్ పటాన్ నాగుల్ మీరాఖాన్ తెలిపారు. మండలంలోని ఈ.బయ్యారం గ్రామపంచాయతీ రావి గూడెం గ్రామానికి చెందిన యువకుడు పడగల శివాజీ, జూలూరుపాడు మండలం నరసాపురం గ్రామానికి చెందిన ధరావత్ మనోజ్ఞా ఈ నెల 25న ప్రేమ వివాహం చేసుకొని, వారికి రక్షణ కల్పించాల్సిందిగా బయ్యారం పోలీస్ ఠాణాను ఆశ్రయించారు. స్పందించిన ఎస్సై శనివారం ఇరువురు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి, కులాంతర వివాహాలతోనే సమ సమాజం సాధ్యమవుతుందని వారికి తెలిపారు. తమకు న్యాయం చేసినందుకు బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్, ఎస్సై నాగుల్ మీరా ఖాన్‌కు ఆదర్శ వివాహం చేసుకున్న శివాజీ మనోజ్నలు ధన్యవాదాలు తెలియజేశారు