ఎపిక్ బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ‘ఓపెన్ హైమర్’ చిత్రం. క్రిస్టోఫర్ నోలన్ రచన, నిర్మాణం, దర్శకత్వంలో రూపొందింన చిత్రమిది. యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా ఇంగ్లీష్‌లో మాత్రమే ఈనెల 21న ఈ సినిమా విడుదలవుతోంది.
మాన్‌హట్టన్ ప్రాజెక్ట్‌లో మొదటి అణ్వాయుధాలను అభివద్ధి చేయడంలో సహాయపడిన సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, అమెరికన్ ప్రోమేథియస్ జె. రాబర్ట్ ఓపెన్‌హైమర్ గురించి 2005లో కైబర్డ్, మార్టిన్ జె, షెర్విన్ రాసిన పుస్తకం ఆధారంగా దీన్ని తెరకెక్కించారు.
ఈ చిత్రంలో సిలియన్ మర్ఫీ టైటిల్ క్యారెక్టర్‌లో నటించగా, ఎమిలీ బ్లంట్, మాట్ డామన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఫ్లోరెన్స్ పగ్, జోష్ హార్ట్‌నెట్, కేసీ అఫ్లెక్, రామి మాలెక్, కెన్నెత్ బ్రానాగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
ఈ చిత్రాన్ని 65 ఎం.ఎం.లార్జ్ ఫార్మాట్ ఫిల్మ్ ఫోటోగ్రఫీతో కలిపి ఐమాక్స్ ఫార్మాట్‌లో రూపొందించారు. అలాగే కాలాన్ని బట్టి కొన్ని భాగాలు బ్లాక్ అండ్ వైట్‌లోనూ కనిపిస్తాయి.
ఫోటోగ్రఫీలో గగుర్పాటు కలిగించే సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ ఎన్నో ఉన్నాయని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా మెప్పిస్తుందనే దీమాతో మేకర్స్ ఉన్నారని చిత్ర బృందం తెలిపింది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ- హౌయ్టే వాన్ హౌటెమా, సంగీతం- లుడ్విగ్ గోరాన్సన్.