వరల్డ్ ఫోకస్ పిక్చర్ పతాకంపై ఆర్.కె బ్రోస్ సమర్పణలో బాసి దర్శకత్వంలో బి.సతీష్ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమ అనే నేను’. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది.హొఈ సందర్భంగా నిర్మాత బి.సతీష్ మాట్లాడుతూ, ‘కొత్త ఆర్టిస్ట్‌లతో ఈ సినిమా చేశాం. కాకినాడ, ఉప్పాడ, మచిలీపట్నం, వైజాగ్ సముద్ర ప్రాంతాల్లో షూట్ చేశాం. మెప్పించే సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేస్తున్నాం. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అని తెలిపారు.
‘అందరి సపోర్ట్‌తో సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రం ఇది’ అని దర్శకుడు బాసి అన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉండే కుర్రాడిగా మంచి పాత్ర చేశానని, నటనకు స్కోప్ ఉన్న పాత్ర అని హీరో ఆర్‌కె బ్రోస్ చెప్పారు.