నిజాయతీ చాటిన యువకుడు

– దొరికిన రూ.20వేలను పోలీసులకు అప్పగింత
– యువకునికి సన్మానం చేసిన సీఐ రాజేందర్‌ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
తాండూరు పట్టణ కేంద్రంలోని హైదరాబాద్‌ రోడ్డు కు ఉన్న ఎస్వీఆర్‌ హాస్పిటల్‌ దగ్గర పగిడయ్యాల గ్రామా నికి చెందిన పోకల పద్మమ్మ తన పాస్‌బుక్‌ రూ. 20 వే లు ఉన్న కవర్‌ను దగ్గర పోగొట్టుకున్నది. ఆ తర్వాత జినుగుర్తి గ్రామానికి చెందిన చిన్నబంకు ప్రవీణ్‌ కుమార్‌కు ఈ రూ.20 వేలు పాస్‌బుక్‌ ఉన్న కవరు ఎస్వీఆర్‌ హాస్పిటల్‌ దగ్గర దొరకింది. వెంటనే ప్రవీణ్‌ కుమార్‌ తాండూర్‌ పోలీ స్‌స్టేషన్‌లో వాటి ని అప్పగించి ఎవరో హాస్పిటల్‌ దగ్గర పోగొట్టుకున్నారు. వాళ్ళకి అప్ప గించాలని చెప్పారు. అతని నిజాయతీకి మెచ్చుకొని తాండూర్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేందర్‌ రెడ్డి సిబ్బంది అతనికి సన్మానం చేసి అభినందించారు. డబ్బులు పాస్‌బుక్‌ పోగొట్టుకున్న పగిడయ్యాలకు చెందిన పోకల పద్మను పిలిపించి ఆమెకు రూ.20 వేలును, పాస్‌బుక్‌ను అం దించి జాగ్రత్తగా ఉండాలని సూచిం చారు. ఎవరికైనా ఏదైనా దొరికితే వాటిని పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించి వారి నిజాయతీని చాటుకోవాలని తాండూరు పట్టణ సీఐ రాజేందర్‌ రెడ్డి తెలిపారు.