రంగనాథ స్వామి రథోత్సవానికి రావాలని మంత్రి తలసానికి ఆహ్వానం

నవతెలంగాణ-ధూల్‌పేట్‌
జియాగూడ చారిత్రక రంగనాథ స్వామి 16వ రథోత్సవానికి రాష్ట్ర మంత్రి తలవని శ్రీనివాస్‌ యాదవ్‌ను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్నట్టు ఆలయ ప్రతినిధి తిరువెంగల శేశాచార్యులు, బేగం బజార్‌ కార్పొరేటర్‌ శంకర్‌ యాదవ్‌, బద్రీనాథ్‌ అన్నారు. ఈ బ్రహ్మౌత్సవాల సందర్భంగా మంత్రి తలసాని యాదవును కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేకంగా నిర్వహించే బ్రహ్మౌత్సవాల్లో భాగంగా ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా ఏర్పాటు చేయాలని సందర్భంగా కోరారు.