పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అబ్జర్వర్..

నవతెలంగాణ- డిచ్ పల్లి:  నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో గల పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సాధారణ పరిశీలకులు గౌతమ్ సింగ్ గురువారం సందర్శించారు. ఓటింగ్ నిర్వహణకై పోలింగ్ కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. కనీస సదుపాయాలైన టాయిలెట్స్, నీటి వసతి, ర్యాంపులు, విద్యుత్ సౌకర్యం వంటివి అందుబాటులో ఉన్నాయా? లేవా? అన్నది గమనించారు. అన్ని వసతులు అందుబాటులో ఉండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ ల పరిధిలోని ఓటర్లకు వారి ఓటు వివరాలతో కూడిన స్లిప్పులు పూర్తి స్థాయిలో పంపిణీ చేశామని స్థానిక అధికారులు అబ్జర్వర్ దృష్టికి తెచ్చారు. ఆయన వెంట తహసీల్దార్ వెంకట్ రావు తదితరులు ఉన్నారు.